ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి స్వర్ణయుగం ఆసన్నమైందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: శ్రీకాకుళం

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి స్వర్ణయుగం ఆసన్నమైందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి మరియు శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో నూతన వృద్ధి శకం మొదలైందని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో పారిశ్రామికంగా, ఆర్థికంగా రాష్ట్రం అగ్రపథాన నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లోనూ ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన ప్రగతిని సాధిస్తుందని తెలిపారు.