అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించిన టీమిండియా
రిపోర్టర్: రాము
స్థలం: భారత్
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో టీమిండియా సరికొత్త చారిత్రాత్మక మైలురాయిని అందుకుంది. ఈ ఫార్మాట్‌లో ఏకంగా 200 విజయాలు పూర్తి చేసుకున్న తొలి జట్టుగా ప్రపంచ రికార్డు సృష్టించింది. జపాన్‌తో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో రెండు పరుగుల తేడాతో విజయం సాధించడం ద్వారా భారత్ ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో పాటు ప్రపంచంలోని మిగతా అన్ని జట్లను వెనక్కినెట్టింది. 2006 నుంచి ఇప్పటివరకు టీమిండియా మొత్తం 291 టీ20 మ్యాచ్‌లు ఆడగా, ఇందులో 200 మ్యాచ్‌లలో ఘన విజయం సాధించింది.