క్రెడిట్ కార్డ్ ఈఎంఐ పేరుతో సైబర్ మోసాలపై విజయవాడ పోలీసుల హెచ్చరిక
రిపోర్టర్: కృష్ణ
స్థలం: ఎన్టీఆర్
క్రెడిట్ కార్డ్ ఈఎంఐ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజయవాడ సిటీ పోలీస్ శాఖ స్పష్టం చేసింది. సైబర్ నేరగాళ్లు ఒక్క ఓటీపీ ద్వారా నలభై ఐదు వేల రూపాయలు కాజేసిన ఉదంతంపై ఒక ప్రత్యేక వీడియో ద్వారా వివరాలు వెల్లడించారు. ఇలాంటి మోసాలకు ఎవరూ బలి కావద్దని, అనుమానాస్పద కాల్స్ పట్ల తీవ్ర అప్రమత్తత అవసరమని అధికారులు సూచించారు. ఆన్ లైన్ ఆర్థిక లావాదేవీల సమయంలో ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని అధికారులు కోరారు.