జాతీయ లోక్ అదాలత్‌లో భారీగా పరిష్కారమైన కేసులు
రిపోర్టర్: శివ
స్థలం: నెల్లూరు
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 31,560 కేసులు పరిష్కారమయ్యాయి. కక్షిదారులకు రూ.9.08 కోట్ల పరిహారం అందించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.నరసింహమూర్తి తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా కేసులకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, ఎగువ కోర్టుల్లో అప్పీలుకు అవకాశం ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.