బ్రిటీష్ వారి దోపిడీ చరిత్రను బట్టబయలు చేస్తున్న విజయ్ దేవరకొండ సినిమా

రిపోర్టర్: రాజేష్ స్థలం: Hyderabad

బ్రిటీష్ వారు మన దేశ సంపదను, వనరులను రైల్వే మార్గాల ద్వారా ఎలా దోచుకున్నారో రణబాలి డాక్యుమెంటరీ ద్వారా వెల్లడించామని హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రశ్మిక మందన్న తెలిపారు. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ది హిస్టరీ వి ఫర్ గాట్ ఎపిసోడ్ యూట్యూబ్ లో విడుదలైందని వారు పేర్కొన్నారు. చరిత్రలో బ్రిటీష్ శ్వేతజాతీయులు దాచిపెట్టిన నిజాలను ఈ డాక్యుమెంటరీ సిరీస్ ద్వారా ప్రజల ముందుకు తీసుకువస్తున్నామని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది.