ఏపీ పోలీస్ స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా

రిపోర్టర్: నరేష్ స్థలం: ఆంధ్రప్రదేశ్

ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ మీట్ ముగింపు వేడుకల్లో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కీలక ప్రకటన చేశారు. పోలీసులకు శారీరక దృఢత్వం అవసరమని, ఇందుకోసం అత్యాధునిక సదుపాయాలతో ఏపీ పోలీస్ స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఓవరాల్ ఛాంపియన్‌గా విశాఖ రేంజ్ నిలిచింది. ర్యాంకులు వేరైనా అందరూ ఒకే జట్టుగా పనిచేయాలని, క్రీడల్లో మహిళల భాగస్వామ్యం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.