స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు: కేసీఆర్ క్షమాపణ చెప్పాలని రేవంత్ డిమాండ్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: తెలంగాణ
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలి రోజు తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అధికార కాంగ్రెస్ మండిపడింది. ఈ ఘటనపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని, నిందితుడిపై వేటు వేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. నల్ల టీషర్ట్లతో అసెంబ్లీకి వెళ్లిన కేటీఆర్, హరీశ్‌రావు సహా పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.