ఓట్ చోరీ ఆరోపణలపై కాంగ్రెస్ తీరును నిలదీసిన బీజేపీ నేత రాంచందర్ రావు

రిపోర్టర్: సురేష్ స్థలం: హైదరాబాద్

ఓట్ చోరీ అంశంపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధాలకు కేరాఫ్గా మారిందని ఆయన ఆరోపించారు. ఢిల్లీలో నిరసనలు తెలుపుతున్న కాంగ్రెస్ నేతలు ఎన్నికల్ లో గెలుపుపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో అమిత్ షా పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ వైఖరిని ఎండగడుతూ వాస్తవాలను ప్రజల ముందుంచుతామని ఆయన స్పష్టం చేశారు.