గాజుల రామారంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద్

రిపోర్టర్: శివ స్థలం: మేడ్చల్ మల్కాజిగిరి

అమ్మవార్ల దయతో భక్తులంతా సుఖసంతోషాలతో వర్ధిల్ల్లాలని కోరుకుంటున్నట్లు బీఆర్ఎస్ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ వెల్లడించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని 125వ గాజుల రామారం డివిజన్ పరిధిలోని లెనిన్ నగర్ ఎల్లమ్మ పోచమ్మ దేవాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండల పూజా కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని అమ్మవార్లకు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తులతో కలిసి పూజాది కార్యక్రమాలలో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించినట్లు ఆయన తెలిపారు.