పోలింగ్ కేంద్రంపై దాడి: బ్యాలెట్ బాక్స్ ధ్వంసం, ఇద్దరు పోలీసులకు గాయాలు

రిపోర్టర్: రాజేష్ స్థలం: అనంతపురం

అనంతపురం జిల్లా కూడేరు మండలం మరుట్ల గ్రామంలో పరిషత్ ఎన్నికల పోలింగ్ కేంద్రంపై వైసీపీ శ్రేణులు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలింగ్ బూత్లోకి చొరబడి బ్యాలెట్ బాక్స్ను బయటకు లాక్కొచ్చి రాళ్లతో ధ్వంసం చేశారని పేర్కొన్నారు. అక్రమాలను అడ్డుకున్న భద్రతా సిబ్బందిపై దాడి చేయడంతో ఇద్దరు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయని, ఈ ఘటనపై అదనపు బలగాలు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చాయని అధికారులు వెల్లడించారు.