ఖమ్మంలో మహిళల ఆటపాటలతో అంబరాన్నంటిన ఐదో రోజు అట్ల బతుకమ్మ సంబరాలు

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మం నగరంలోని పద్నాలుగు, పదిహేనవ డివిజన్లలో ఐదవ రోజు అట్ల బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు పూలతో బతుకమ్మలను అలంకరించి, సంప్రదాయ పాటలు పాడుతూ కోలాటాలు ఆడారు. సీపీఐ నేతలు మాట్లాడుతూ అట్లను నైవేద్యంగా సమర్పించడం బతుకమ్మ ప్రత్యేకత అని తెలిపారు. అనంతరం బతుకమ్మలను జలవనరుల్లో భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.