గోదావరి తీరాన భక్తుల కొంగుబంగారమైన శ్రీ జనార్ధన స్వామి
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: ధవళేశ్వరం
రాజమహేంద్రవరం సమీపంలోని ధవళేశ్వరంలో వెలసిన శ్రీ జనార్ధన స్వామి ఆలయం చరిత్రాత్మకంగా, ఆధ్యాత్మికంగా ప్రసిద్ధి చెందింది. ధవళగిరి కొండపై గుహలో శ్రీదేవి, భూదేవి సమేతంగా కొలువైన స్వామిని చాళుక్యుల కాలం నాటి నుంచే పూజిస్తున్నట్లు చరిత్ర చెబుతోంది. నారద మహర్షి ఆరాధించిన ఈ పవిత్ర క్షేత్రంలో గోదావరి నది విశిష్టత, సంతాన గోపాల స్వామి, రామపాద క్షేత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.