నోయిడా విమానాశ్రయానికి ప్రధాని పేరు: యూపీ కేబినెట్ కీలక ఆమోదం
రిపోర్టర్: విజయ్
స్థలం: లక్నో
ఉత్తరప్రదేశ్లోని జేవర్లో నిర్మించిన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరు పెట్టేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. లక్నోలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రధాని మోదీ హయాంలో యూపీలో మౌలిక వసతులు మెరుగయ్యాయని తెలిపారు. ఈ ప్రతిపాదనను త్వరలోనే కేంద్ర పౌర విమానయాన శాఖకు పంపనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.