కడప జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా గుర్తింపుతో తొమ్మిది మంది అరెస్ట్

రిపోర్టర్: గోపి స్థలం: వైఎస్ఆర్ కడప

వైఎస్ఆర్ కడప జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాపై పోలీసులు విస్తృత దాడులు నిర్వహించినట్లు కడప పోలీసులు వెల్లడించారు. మూడు వేర్వేరు కేసుల్లో తొమ్మిది మంది స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. సుమారు 1.810 టన్నుల బరువున్న 87 ఎర్రచందనం దుంగలతో పాటు అక్రమ రవాణాకు ఉపయోగించిన ఐదు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు కడప పోలీసులు స్పష్టం చేశారు.