హాకీ ఇండియాలో తీవ్ర కలకలం, డీజీకి షోకాజ్ నోటీసులు
రిపోర్టర్: సునీల్
స్థలం: భారత్
హాకీ ఇండియాలో అంతర్గత పోరు తీవ్రమైంది. అధ్యక్షుడు దిలీప్ టిర్కీ డైరెక్టర్ జనరల్ ఆర్కే శ్రీవాస్తవకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నిబంధనల ఉల్లంఘన, పాలనా పరమైన వైఫల్యాల నేపథ్యంలో ఆయనను తక్షణమే విధుల నుంచి తప్పుకోవాలని ఆదేశించారు. శ్రీవాస్తవకు ఉన్న అధికారాలన్నీ తక్షణ ప్రభావంతో నిలిపివేయబడ్డాయని స్పష్టం చేశారు. బాధ్యతలు వెంటనే వేరే అధికారికి అప్పగించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.