వినాయక మండపాల వద్ద జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపు

రిపోర్టర్: Chinukani Yuvaraju స్థలం: చౌటుప్పల్

సెప్టెంబర్ 17న ప్రతి వినాయక మండపం వద్ద జాతీయ జెండాను గౌరవంగా ఎగురవేసి, దేశభక్తి, జాతీయ ఐక్యతను చాటాలని భజరంగ్ దళ్ యాదాద్రి భువనగిరి జిల్లా కన్వీనర్ గోగు రవి పిలుపునిచ్చారు. చౌటుప్పల్లో ఆయన మాట్లాడుతూ, వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తూ జాతీయ జెండాకు గౌరవం తెలియజేసి, వందేమాతరం గేయాన్ని ఆలపించాలని కోరారు. పిల్లలు, యువతలో దేశభక్తిని పెంపొందించాలని సూచించారు.