నిరుద్యోగులకు గుడ్ న్యూస్: ఎన్ఎమ్ఎంసీ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదల
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: నవీ ముంబై
నవీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అసిస్టెంట్ కమిషనర్ సహా వివిధ ఆరు కేడర్ పోస్టుల ప్రిలిమినరీ పరీక్షల ఫలితాలతో పాటు స్కోర్కార్డులను విడుదల చేసినట్లు ఎన్ఎమ్ఎంసీ అధికారులు వెల్లడించారు. ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా తమ ఫలితాలను పరిశీలించుకోవచ్చని తెలిపారు. అర్హత సాధించిన అభ్యర్థులు తదుపరి మెయిన్ పరీక్షకు హాజరయ్యేందుకు అర్హులని అధికారులు పేర్కొన్నారు.