డీఎస్సీపై సీబీఐ విచారణకు సిద్ధమంటూ ఎమ్మెల్యే సోమిరెడ్డి సవాల్

రిపోర్టర్: గోపి స్థలం: సర్వేపల్లి

డీఎస్సీ అంశంపై సీబీఐ విచారణ జరిపించాలంటూ వైకాపా చేస్తున్న డిమాండ్లపై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. వైకాపా నాయకులు కోరుతున్నట్లుగా సీబీఐ దర్యాప్తునకు తమ ప్రభుత్వం సిద్ధమేనని ఆయన స్పష్టం చేశారు. అయితే గతంలో సీబీఐపై నమ్మకం లేదంటూ కోర్టుల్లో కౌంటర్లు దాఖలు చేసిన వారు ఇప్పుడు అదే దర్యాప్తు సంస్థ విచారణ కోరడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయా అంశాలపై వైకాపా నేతలు ముందుగా స్పష్టత ఇవ్వాలని ఆయన తేల్చిచెప్పారు.