భారీ వర్షాలకు కొట్టుకుపోయిన పొలాలు నష్టపరిహారం చెల్లించాలని రైతుల వేదన

రిపోర్టర్: G Satyam🌹 స్థలం: చింతపల్లి

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం బలపం పంచాయతీ పరిధిలోని దిగజానప గ్రామంలో మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు పెద్ద గడ్డ పొంగి ప్రవహించడంతో రైతుల పొలాలు నీట మునిగి కొట్టుకుపోయాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని స్థానిక అన్నదాతలు విజ్ఞప్తి చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.