రంపచోడవరం అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: రంపచోడవరం
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ పరిధిలోని గంగవరం అటవీ ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. పులి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా రేడియో శాటిలైట్ కాలర్ అమర్చినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో గిరిజన గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అటవీ ప్రాంతాల్లోకి ఒంటరిగా ఎవరూ వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.