రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి సభ్యుడిగా అంచా పాండురంగారావు నియామకం

రిపోర్టర్: అశోక్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి న్యాయ విభాగం సభ్యుడిగా అంచా పాండురంగారావును నియమిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారని అధికారులు తెలిపారు. ఆయన బాధ్యతలు చేపట్టిన తేదీ నుంచి ఐదేళ్ల పాటు లేదా డెబ్బై సంవత్సరాల వయస్సు వచ్చే వరకు పదవిలో కొనసాగుతారని వెల్లడించారు. హైకోర్టులో ముప్పై రెండేళ్లుగా న్యాయవాదిగా సేవలు అందిస్తున్న ఆయనకు సివిల్, క్రిమినల్ కేసుల వాదనలో విశేష అనుభవం ఉందని పేర్కొన్నారు.