మంత్రి లోకేశ్‌ను కలిసిన నరసింహ యాదవ్ శ్రీనివాస్
రిపోర్టర్: మదన్ రాయల్
స్థలం: తిరుపతి అర్బన్
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ను రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, తిరుపతి నియోజకవర్గ ఇన్చార్జ్ జేబీ శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుపతి అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై మంత్రి నారా లోకేశ్‌తో వారు చర్చించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, యువతకు ఉపాధి అవకాశాలపై చర్చించారు. తిరుపతి ప్రాంతంలో పార్టీని బలోపేతం చేసేందుకు నాయకులు సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా వారు అభిప్రాయపడ్డారు.