దసరా పండుగ రద్దీ: కల్వకుర్తి బస్టాండ్లో ప్రయాణికుల తీవ్ర రద్దీ
రిపోర్టర్: Anjaneyulu Yadav
స్థలం: కల్వకుర్తి
దసరా పండుగ సెలవుల నేపథ్యంలో కల్వకుర్తి పట్టణంలోని బస్టాండ్ శుక్రవారం ప్రయాణికులతో రద్దీ పెరిగింది. కుటుంబ సభ్యులతో పండుగ జరుపుకునేందుకు పట్టణవాసులు, విద్యార్థులు సొంతూళ్లకు వెళ్తుండటంతో బస్టాండ్ కిటకిటలాడింది. బస్సుల కోసం ప్రయాణికులు భారీ సంఖ్యలో వేచి ఉండటంతో రద్దీ వాతావరణం నెలకొంది.