పేద కుటుంబాలకు సంక్షేమ భరోసానిస్తున్న నూతన స్మార్ట్ రేషన్ కార్డులు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: యాదగిరిగుట్ట
పేద కుటుంబాలకు ఆహార భద్రత కల్పించడంతో పాటు సంక్షేమ పథకాలను అందించడంలో రేషన్ కార్డులు కీలకమని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. యాదగిరిగుట్ట మండలంలో నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన లబ్ధిదారులకు కార్డులను అందజేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఫలాలు అందించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.