కౌంటీ క్రికెట్‌లో అదరగొట్టిన భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్

రిపోర్టర్: రాజేష్ స్థలం: India

కౌంటీ చాంపియన్‌షిప్‌లో యార్క్‌షైర్ తరఫున ఆడుతున్న భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఎసెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మొత్తం 10 వికెట్లు పడగొట్టి జట్టుకు ఘన విజయం అందించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన కుల్దీప్, బ్యాటింగ్‌లోనూ రాణించి 36 పరుగులు సాధించాడు.