తాపీ సంఘం అధ్యక్షుడిగా సంకరీ కృష్ణ ప్రధాన కార్యదర్శిగా ఎలగం శ్రీనివాస్‌ విజయం,, ఆవుల కొమురయ్య

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

బెల్లంపల్లి తాపీ కార్మిక సంఘం ఎన్నికల్లో సంకరీ కృష్ణ, ఎలగం శ్రీనివాస్‌ ఘన విజయం సాధించారు. అధ్యక్ష పదవికి పడవ గుర్తుపై పోటీ చేసిన సంకరీ కృష్ణకు 293 ఓట్లు లభించగా.. ప్రత్యర్థిపై 58 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ప్రధాన కార్యదర్శి పదవికి కొబ్బరికాయ గుర్తుపై పోటీ చేసిన ఎలగం శ్రీనివాస్‌కు 316 ఓట్లు రాగా.. 106 ఓట్ల మెజారిటీతో విజయం సాధించినట్లు ఆవుల కొమురయ్య తెలిపారు..

సంఘంలో మొత్తం 621 ఓట్లు ఉండగా 556 ఓట్లు పోలయ్యాయి. ఫలితాలు వెలువడడంతో విజేతల అనుచరులు సంబరాలు చేసుకున్నారు.