రైతన్నలకు భారీ ఊరట: పంట రుణాల చెల్లింపులపై రేవంత్ సర్కార్ కసరత్తు

రిపోర్టర్: గోపి స్థలం: తెలంగాణ

తెలంగాణలోని కరువు ప్రభావిత ప్రాంతాల రైతన్నలకు పంట రుణాల చెల్లింపుల విషయంలో భారీ వెసులుబాటు కల్పించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ లో వర్షాభావం కారణంగా ఎండిపోయిన పంటల నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని, రుణాల చెల్లింపును దీర్ఘకాలిక ప్రాతిపదికన మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు గడువు పెంచే దిశగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.