రేషన్ షాపుల్లో నిత్యావసరాల పంపిణీకి ఏర్పాట్లు చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

రిపోర్టర్: విజయ్ స్థలం: సూర్యాపేట

రేషన్ షాపుల ద్వారా నాణ్యమైన నిత్యావసర వస్తువుల సరఫరాకు రంగం సిద్ధం చేసినట్లు రాష్ట్ర మంత్రి మరియు హుజూర్ నగర్ శాసనసభ్యులు నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా మారుస్తూ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిత్యావసరాలను అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, రేషన్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిందని ఆయన స్పష్టం చేశారు.