ఓటీటీలోకి మెగాస్టార్ చిరంజీవి: మెగావర్స్ టాక్ షో షూటింగ్ ప్రారంభం

రిపోర్టర్: గోపి స్థలం: హైదరాబాద్

ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్ వేదికగా అగ్ర నటుడు చిరంజీవి నిర్వహిస్తున్న మెగావర్స్ సెలబ్రిటీ టాక్ షో షూటింగ్ మంగళవారం ప్రారంభమైందని సినీ వర్గాలు వెల్లడించాయి. తొలి ఎపిసోడ్లో ప్రముఖ హాస్య నటులు బ్రహ్మానందం, సునీల్, సత్య పాల్గొన్నట్లు సమాచారం. దాదాపు పదిహేను ఎపిసోడ్లతో తొలి సీజన్ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సినీ వర్గాలు పేర్కొన్నాయి.