సేలం రైల్వే జంక్షన్ వద్ద దీపావళి భద్రత కట్టుదిట్టం: పోలీసుల తనిఖీలు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: సేలం

గుతున్న నేపథ్యంలో సేలం జంక్షన్ రైల్వే స్టేషన్ లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు పోలీసులు తెలిపారు. సూరమంగళం ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి నేతృత్వంలో జీఆర్పీ, ఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాయి. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్లాట్ఫారాలు, రైళ్లలో అనుమానాస్పద వస్తువులు, మత్తు పదార్థాల రవాణాపై స్నిఫర్ డాగ్స్ సహాయంతో ముమ్మరంగా తనిఖీలు చేపట్టామని అధికారులు పేర్కొన్నారు.