నిరుద్యోగులకు గుడ్ న్యూస్: ఐదు వందల ముప్పై అప్రెంటిస్ పోస్టుల భర్తీ

రిపోర్టర్: కిరణ్ స్థలం: హైదరాబాద్

యూకో బ్యాంక్ లో ఐదు వందల ముప్పై అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు బ్యాంక్ అధికారులు వెల్లడించారు. ఈ అప్రెంటిస్ ఖాళీల దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ పద్నాలుగు నుంచి ప్రారంభమై అక్టోబర్ ఇరవై తొమ్మిది వరకు కొనసాగుతుందని తెలిపారు. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఆన్ లైన్ దరఖాస్తులను అధికారిక వెబ్ సైట్ ద్వారా సమర్పించాలని అధికారులు స్పష్టం చేశారు.