నవంబరు 19 నుంచి రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభం
రిపోర్టర్: సునీల్
స్థలం: హైదరాబాద్
తెలంగాణలో నవంబరు 19 నుంచి రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటు కోసం అర్హులైన లబ్ధిదారులకు తొలి విడతగా రూ.1 లక్ష వరకు ఆర్థిక సాయం అందించనున్నారు. ప్రజాభవన్ లో జరిగిన సమీక్షలో కలెక్టర్ల ఆధ్వర్యంలో పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.