84 మంది బాధితులకు రూ.53.24 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ
రిపోర్టర్: saikiran
స్థలం: శేరిలింగంపల్లి
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అత్యవసర వైద్య చికిత్స కోసం దరఖాస్తు చేసుకున్న 84 మంది బాధితులకు రూ.53,24,150 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ అందజేశారు.
స్థానిక కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్ తదితరులతో కలిసి లబ్ధిదారులకు ఈ ఆర్థిక సహాయం అందించినట్లు నిర్వాహకులు తెలిపారు.