వైద్యులపై దాడి కేసులో కార్పొరేటర్లపై చార్జ్‌షీట్ దాఖలు

రిపోర్టర్: సతీష్ స్థలం: మహారాష్ట్ర

మహారాష్ట్రలోని డాంబివ్‌లిలో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, నర్సులపై దాడికి పాల్పడిన శివసేన కార్పొరేటర్ రమేష్ మాత్రేతో పాటు మరో నలుగురిపై కళ్యాణ్ పోలీసులు 1,832 పేజీల చార్జ్‌షీట్ దాఖలు చేశారు. జూలై 6న జరిగిన ఈ ఘటనపై బాంబే హైకోర్టు సుమోటోగా స్పందించి విచారణను వేగవంతం చేయాలని ఆదేశించడంతో, పోలీసులు 66 రోజుల్లోనే చార్జ్‌షీట్ సమర్పించారు.