పలాస ఇచ్చాపురంలో ఉత్కంఠగా మొదలైన మున్సిపల్ ఓట్ల లెక్కింపు

రిపోర్టర్: JR RAO స్థలం: శ్రీకాకుళం

పలాస, ఇచ్చాపురం మున్సిపాలిటీల పరిధిలో మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. పలాసలో ఐదు రూముల్లో నలభై టేబుల్స్, మూడు హాల్ లో ముప్ పై మూడు టేబుల్స్ అధికారులు ఏర్పాటు చేశారు. దీంతో పోటీ చేసిన అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు భద్రత ఏర్పాట్లు చేశారు. మీడియా సభ్యులను లోపలికి అనుమతించకపోవడంతో వారు నిరసన వ్యక్తం చేశారు.