మురుగునీటి సమస్యపై క్షేత్రస్థాయిలో పరిశీలన: శ్రీకాకుళంలో గోండు శంకర్ పర్యటన

రిపోర్టర్: రాము స్థలం: శ్రీకాకుళం

శ్రీకాకుళం నగరంలోని నీలమ్మ కాలనీ, బుధవారపు పేట వద్ద నారాయణపురం రైట్ కెనాల్ మురుగునీటి సమస్యపై మున్సిపల్ కమిషనర్ శ్రీ శ్రవణ్ కుమార్ గారితో కలసి క్షేత్రస్థాయిలో పర్యటించినట్లు గోండు శంకర్ శ్రీకాకుళమా వెల్లడించారు. ఈ సందర్భంగా స్థానికులను వేధిస్తున్న సమస్యలను స్వయంగా పరిశీలించామని తెలిపారు. సమస్యను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొంటూ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.