పెరిగిన పనిభారం ఇద్దరు ఎమ్మార్వోల కోసం ప్రజల డిమాండ్

రిపోర్టర్: amudala Venkanna స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మం అర్బన్ తహశీల్దార్ కార్యాలయంలో పెరిగిన పనిభారంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగర విస్తరణ, విలీన గ్రామాలతో ఒక్క ఎమ్మార్వోపై అధిక బాధ్యతలు ఉన్నాయి. దీంతో ధ్రువీకరణ పత్రాలు, మ్యుటేషన్లు, భూ సమస్యల పరిష్కారంలో విపరీతమైన జాప్యం జరుగుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్బన్-1, అర్బన్-2గా కార్యాలయాన్ని విభజించి ఇద్దరు ఎమ్మార్వోలను తక్షణమే నియమించాలని స్థానిక ప్రజలు బలంగా డిమాండ్ చేస్తున్నారు.