కాంగ్రెస్ పాలనపై కందాళ నిప్పులు.. ప్రజల పశ్చాత్తాపం!
రిపోర్టర్: kasanivenkatesh
స్థలం: నేలకొండపల్లి
కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు ప్రజలు తీవ్రంగా పశ్చాత్తాపపడుతున్నారని మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ఆరోపించారు. నేలకొండపల్లిలో ఆయన మాట్లాడుతూ, ప్రజాపాలనలో సామాన్యులు అధికారుల చుట్టూ, పీఏల చుట్టూ తిరగాల్సి వస్తోందని మండిపడ్డారు.
పార్టీలు మారితేనే సంక్షేమ పథకాలు ఇస్తామనడం అన్యాయమని, ప్రభుత్వం అందరిదీ అని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ను విమర్శించే స్థాయి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి లేదని కందాళ ఘాటుగా విమర్శించారు.