హీరో రవితేజ కొత్త సినిమాకు తులాభారం టైటిల్ ఖరారు చేసినట్లు ప్రచారం
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: హైదరాబాద్
ఇరుముడి విజయంతో జోరుమీదున్న హీరో రవితేజ తదుపరి చిత్రానికి దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రాజెక్టుకు తులాభారం అనే ఆసక్తికరమైన టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. హర్రర్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాను దసరా పండుగ కానుకగా లాంఛనంగా ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.