'నా చిన్నతనంలో తాతయ్య, చిన్నాన్నలే నన్ను పెంచి పెద్దచేశారు': రోహిత్ శర్మ భావోద్వేగం
రిపోర్టర్: కిరణ్
స్థలం: ఇండియా
ప్రముఖ టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ తాజాగా 'ఫ్యామిలీ ఫుల్ హౌస్' షోలో తన బాల్యం మరియు క్రికెట్ ప్రయాణం గురించి భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. తన చిన్నతనంలో తల్లిదండ్రులకు దూరంగా తాతయ్య, చిన్నాన్నల వద్ద పెరిగానని, వారు తన కోసం ఎన్నో త్యాగాలు చేసి క్రికెట్ ఫీజులు చెల్లించారని రోహిత్ గుర్తుచేసుకున్నారు. వారి మద్దతు వల్లే తాను ఈ స్థాయికి చేరుకోగలిగానని రోహిత్ శర్మ తెలిపారు.