ఓటర్ల తొలగింపు కుట్రలపై బీజేపీ ప్రభుత్వ తీరుపై మహేష్ కుమార్ గౌడ్ మండిపాటు
రిపోర్టర్: శివ
స్థలం: నిజామాబాద్
అర్హులైన ఓటర్ల పేర్లను తొలగిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. నిజామాబాద్ లో జరిగిన గణేష్ నిమజ్జనయాత్రలో ఆయన మాట్లాడుతూ, పౌరులకు నోటీసులు ఇస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ డిమాండ్ చేసినట్లుగా ఎన్నికల సంఘం చీఫ్ తక్షణమే తప్పుకోవాలని, లేదంటే ప్రభుత్వం వారిని అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.