అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం బోల్తా పడిన ఆర్టీసీ బస్సు
రిపోర్టర్: సతీష్
స్థలం: అన్నమయ్య జిల్లా
అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు సుమారు 20 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వారి పరిస్థితి సురక్షితంగానే ఉందని స్పష్టం చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.