లక్మే ఫ్యాషన్ వీక్‌లో ఆయుష్మాన్, సారా అలీఖాన్ అద్భుతమైన గ్లామర్ ప్రదర్శన
రిపోర్టర్: గోపి
స్థలం: New Delhi
న్యూఢిల్లీలోని తాజ్ పాలెస్లో జరిగిన లక్మే ఫ్యాషన్ వీక్ 2026 వేడుకలో ప్రముఖ బాలీవుడ్ నటులు ఆయుష్మాన్ ఖురానా, సారా అలీఖాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారని టైమ్స్ ఆఫ్ ఇండియా లైఫ్‌స్టైల్ డెస్క్ వెల్లడించింది. ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా ప్రదర్శించిన లగ్జరీ ప్రెట్ కలెక్షన్ కోసం వీరిద్దరూ షోస్టాపర్లుగా వ్యవహరించారు. ఆయుష్మాన్ ఎంబ్రాయిడరీ నల్లటి జాకెట్లో మెరిసిపోగా, సారా మోడర్న్ కార్సెట్ మరియు ఫ్లోయింగ్ స్ర్కిట్లో రెడ్ కార్పెట్ గ్లామర్‌ను తెచ్చారని నిర్వాహకులు తెలిపారు.