వైట్ హౌస్ లో సంచలనం: చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా స్టీఫెన్ మిల్లర్ నియామకం
రిపోర్టర్: రాము
స్థలం: Washington
అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుత చీఫ్ ఆఫ్ స్టాఫ్ సుసీ విల్స్ ను తొలగిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఆమె స్థానంలో తన అత్యంత సన్నిహితుడు, సీనియర్ సలహాదారు స్టీఫెన్ మిల్లర్ ను నూతన చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా నియమించినట్లు ట్రంప్ స్పష్టం చేశారు. ఇటీవలి ఎన్నికల్ లో రిపబ్లికన్ పార్టీ ఎదుర్కొన్న ఎదురుదెబ్బల నేపథ్యంలో ఈ ప్రక్షాళన జరగడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది.