పొంగిపొర్లిన పెద్దమోరితో నివాసాలను ముంచెత్తిన వరద నీరు
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పురపాలక సంఘం పరిధిలోని 12వ వార్డులో తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి గాంధీ పార్క్ పెద్దమోరి పొంగిపొర్లుతూ వరద నీరు నివాస గృహాల్లోకి చేరింది. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, 12వ వార్డు కౌన్సిలర్ పాక చిరంజీవి యాదవ్‌తో కలిసి ఉదయం ఐదు గంటలకే ప్రభావిత ప్రాంతాలను నేరుగా సందర్శించి పరిశీలించారు. తక్షణమే మున్సిపల్ సిబ్బందిని రంగంలోకి దించి నీటిని తొలగించే చర్యలు చేపట్టి బాధితులకు ఊరట కలిగించారు.