'డీజేకు అనుమతివ్వండి': తెలుగుఫీడ్సైట్ ఆధ్వర్యంలో టీడీపీ నిరసన
రిపోర్టర్: మహేష్
స్థలం: సంతమాగులూరు
అద్దంకి నియోజకవర్గం సంతమాగులూరు మండలం మక్కెనవారిపాలెంలో వినాయక నిమజ్జనంలో డీజేకు అనుమతి ఇవ్వలేదంటూ తెలుగుఫీడ్సైట్ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు తీవ్ర నిరసన చేపట్టాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. నారా లోకేష్, చంద్రబాబు, గొట్టిపాటి రవికుమార్ ఎవరు వచ్చినా సమస్య పరిష్కరించాలని నినాదాలు చేశారు. నిమజ్జన వేడుకలకు అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడుతూ తక్షణమే అనుమతులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.