శాంతియుత వేడుకలకై పోలీసుల ప్రత్యేక భద్రతా సమీక్ష

రిపోర్టర్: Alfa News Desk స్థలం: చిట్వేల్

వినాయక చవితి పండుగను ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పోలీసు అధికారులు సూచించారు. జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బారాయుడు ఆదేశాల మేరకు రేణిగుంట డీఎస్పీ శ్రీ వై. శ్రీనివాసరావు, కోడూరు రూరల్ సీఐ శ్రీ డి. శ్రీనివాసులు, చిట్వేల్ ఎస్ఐ శ్రీ ఎస్. వినోద్ కుమార్లు మండలంలోని సిద్ధారెడ్డిపల్లి, వెంకటరాజపురం గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులతో సమావేశాలు నిర్వహించి నిమజ్జనం సమయంలో భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఊరేగింపులను శాంతియుతంగా నిర్వహించాలని హెచ్చరించారు.