పంతంగి గ్రామంలో అభివృద్ధి పనులను పరిశీలించిన జడ్పీ సీఈవో శోభారాణి
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి గ్రామంలో జడ్పీ సీఈవో శోభారాణి గురువారం పర్యటించారు. గ్రామంలో ఆర్అండ్బీ రహదారి పనులు, పంట కుంటల నిర్మాణాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి అభివృద్ధి పనులపై చర్చించారు. భవిష్యత్ నీటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఇంకుడు గుంతలు, చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.