నిరుపయోగంగా మారి శిథిలావస్థకు చేరిన గుండాల మండల కేంద్రంలోని అతిథి గృహం

రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి స్థలం: ఆత్మకూరు(ఎం)

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గంలోని గుండాల మండల కేంద్రంలో గల అతిథి గృహము మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ ఉప్పునూతుల పురుషోత్తం రెడ్డి హయాంలో నిర్మించారు.దీనికి ప్రహరీ గోడ లేదు.గత 12 సంవత్సరాలుగా దీని ఆలనా పాలనా చూసే వాచ్ మెన్ లేడు.దీంట్లో ఫర్నీచర్ దుమ్ము, ధూళితో నిండిపోయింది.ఫ్లోరింగ్ ధ్వంసం అయింది.నీటి వసతి లేదు.నిరుపయోగంగా మారింది.దీన్ని పట్టించుకునే నాథుడే లేడు.ప్రభుత్వానికి అనేకసార్లు నాయకులు వినతులు చేసారు. పాత్రికేయులు వార్తలు రాసి అలసిపోయారు.ఇది ఇప్పుడు శిథిలావస్థకు చేరింది.పాలకులు వెంటనే స్పందించాలి.ఈ సమస్యకు పరిష్కారం చూపాలి అంటున్న సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మద్దెపురం రాజు.