మహిళల రక్షణే ధ్యేయంగా సైబరాబాద్ పోలీసులు: షీ టీమ్స్ ముమ్మర తనిఖీలు
రిపోర్టర్: మహేష్
స్థలం: మేడ్చల్ మల్కాజిగిరి
మహిళలు మరియు పిల్లల రక్షణ కోసం చేపట్టిన ప్రత్యేక చర్యల్లో భాగంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో షీ టీమ్స్ ఆధ్వర్యంలో వందకు పైగా డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ తనిఖీల్లో యాభై ఐదు మంది నిందితులను అదుపులోకి తీసుకుని, నలభై ఎనిమిది చిన్న కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అలాగే పలువురు బాధితులను రక్షించడంతో పాటు వేలాది మందికి అవగాహన కల్పించినట్లు వారు స్పష్టం చేశారు.